-ముఖ్యఅతిథిగా షీ టీం ఎస్సై హేమ

మంచిర్యాల శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల షీటీం ఎస్సై హేమ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో మహిళపై జరుగుతున్న దాడులపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. మొబైల్ వాడకం ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో అనవసర వెబ్ సైట్ లను ఉపయోగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో రాణిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అనిత, అధ్యాపకురాలు మానస మాట్లాడుతూ.. సైబర్ నెరగాళ్ళ ఉచ్చులో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను కళాశాల కరెస్పాండెంట్ పల్లె భూమేష్ అందిస్తారని తెలియజేశారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థినులకు కళాశాల ఆధ్వర్యంలో పలు విభాగాల్లో పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ జ్యోతి, అధ్యాపకులు శ్రావణి, ఫహీమ, సానియా విద్యార్థినులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి