మంచిర్యాల ప్రత్యక్షత:- తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరానికి చాటి చెప్పారు శ్రీహర్ష డిగ్రీ కళాశాల విద్యార్థినులు, మహిళ అధ్యాపకులు, యాజమాన్యం శనివారం కళాశాల ఆధ్వర్యంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకులు బోనమెత్తి సాంప్రదాయ పద్ధతిలో కళాశాల ఆవరణలో అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం బోనాల పండుగ విశిష్టతను శ్రీహర్ష కళాశాలల చైర్మెన్ పల్లె భూమేష్ స్పష్టంగా వివరించారు. ఆషాఢం మాసంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలని వివిధ రూపాలలో మహిమ గల అమ్మవార్లను కొలవడం తెలంగాణ ప్రజల సంస్కృతిని అని తెలిపారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దలమ్మ, దేవతామూర్తులకు కుంకుమ, చీరసారే, బోనాలతో నైవేద్యం పెట్టి మొక్కలు చెల్లించడం ఇక్కడి ప్రజల అనవాయితీ అని పేర్కొన్నారు.

ఇంతటి బోనాల చరిత్ర కలిగిన జాతర వేడుకలు తమ కళాశాలలో మహిళ ఆధ్యాపకులు, విద్యార్థినిలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆషాఢ మాసంలో మహిళలకు ప్రత్యేక విశిష్టత అయిన గోరింటాకు వేడుకలు కళాశాలలో ప్రిన్సిపాల్ అరెల్లి అనిత అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోరింటాకును బాలికలు, మహిళలు ఎంతో ప్రాధాన్యతగా బావించి చేతిన పెట్టుకొని ఆనందోత్సవంలో తేలుతారని అధ్యాపకురాలు సరళ అన్నారు. గోరింటాకు పెట్టుకోవడం బారతీయ మహిళకు సంస్కృతిలో ఒక భాగమని, సాంప్రదాయం, ఆరోగ్యంతో పాటు శరీరానికి చల్లదనాన్ని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఈ బోనాల వేడుకల్లో డైరెక్టర్ మనోహర్ రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి