-మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె ప్రారంభించిన కార్మికుల మద్దతు కోసం టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి నిరవధిక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20వేల కార్మికులు తమ ప్రధాన డిమాండ్లుగా విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్‌పీడీసీఎల్లో అన్‌మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిసన్లుగా విలీనం చేయాలని కోరారు. అలాగే 2016కు ముందు అర్హతలు కలిగి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిసన్లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల జిల్లా యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.