-కళాకారులతో 30 గంటలపాటు ప్రదర్శన

-ఈ రికార్డుపై సంతోషం వ్యక్తపరిచిన ఎర్రవెల్లి మెర్సీ రాణి

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం 1116 మంది కళాకారులతో 30 గంటలపాటు ప్రదర్శన నిర్వహించారు. సకల కళల సంబరాల జాతరలో భాగంగా వరంగల్ పోతన విజ్ఞానపీఠం వారి ఆడిటోరియంలో జరిగినటువంటి. కార్యక్రమంలో రామకృష్ణాపూర్ కి చెందిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీ పిల్లలు పాల్గొన్నారు. అకాడమీ చైర్ పర్సన్ ఎర్రవెల్లి మెర్సీ రాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు చాలామందిని ఆకట్టుకున్నాయని అన్నారు.

మంచిర్యాల జిల్లా నుండి వచ్చి ఆ వేదికపై ప్రదర్శించినదుకు ఎంతో అనుభూతి, సంతోషాన్ని కలగజేశాయని ఆమె పేర్కొన్నారు. సమీక్ష,అక్షయ,శ్రీ వైష్ణవి అభిజ్ఞ,అక్షయ,పిల్లలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెడల్స్ అందుకున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ క్రియేషన్స్ అధినేత ఆడపు రవీందర్,టీవీ అశోక్ కుమార్, సంస్థ వ్యవస్థాపకులు శివ హరిత, బెల్లంపల్లి హనుమండ్ల మధుకర్,రాకం సంతోష్, రామగిరి అర్జున్,ఆర్ ఆర్ ప్రసాద్ రావు,కళా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి