హోమ్టాప్ న్యూస్రోడ్లపై మద్యం సేవిస్తే కేసులే.. హెచ్చరించిన పోలీసులు

రోడ్లపై మద్యం సేవిస్తే కేసులే.. హెచ్చరించిన పోలీసులు

Published on

spot_img

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న యువకులపై రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న పలువురు యువకులను గుర్తించిన పట్టణ ఎస్సై శ్రీధర్ వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని వారికి అవగాహన కల్పించారు. అనంతరం సంబంధిత యువకులపై పెట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ, పట్టణంలో పార్కులు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతిరోజూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఇలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై సమాచారం అందించాలని, పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Latest articles

నకిలీ విత్తనాల విక్రేతపై పీడీ యాక్ట్ అమలు

-రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: రామగుండం సీపీ మంచిర్యాల ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

-బీఎల్‌వోలు ఇంటింటి సర్వేతో 100 శాతం పూర్తి చేయాలి:గడియారం శ్రీహరి మంచిర్యాల ప్రత్యక్షత:- మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

మంచిర్యాల ప్రత్యక్షత:- హాజీపూర్ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ పుష్పలత...

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సు

లక్షెట్టిపేట ప్రత్యక్షత:- మండలంలోని వెంకట్రావుపేట రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. తహసిల్దార్...

More like this