హోమ్ టాప్ న్యూస్ మైక్రో బయాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన గడియారం అక్షయ

మైక్రో బయాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన గడియారం అక్షయ

0

మంచిర్యాల ప్రత్యక్షత:-హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన గాంధీ ఫార్మేషన్ డే కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి పల్లవి ల రెండవ కుమార్తె డాక్టర్ అక్షయ మైక్రో బయాలజీలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ అక్షయ గడియారం కు గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని హౌస్ సర్జన్ చేస్తున్న తన రెండవ కుమార్తె డాక్టర్ గడియారం అక్షయ ఎంబిబిఎస్ రెండో సంవత్సరంలో మైక్రో బయాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. వైద్యురాలిగా నిరుపేద వర్గాలకు సేవ చేయాలనే ఆశతో తన కుమార్తె ఉందని తెలిపారు. ఈ సందర్భంగా గడియార అక్షయకు టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపు రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమెను అభినందించారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version