హోమ్టాప్ న్యూస్మహాధర్నాకు ఉద్యోగుల సమరభేరి

మహాధర్నాకు ఉద్యోగుల సమరభేరి

Published on

spot_img

-27న నస్పూర్‌లో భారీ ఆందోళనకు సన్నాహాలు

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నస్పూర్‌ ఐడీఓసీ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేసేందుకు టీజీఈజేఏసీ నాయకులు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 3 వేల మంది ఉద్యోగులు తరలివచ్చేలా కార్యాచరణ చేపట్టారు.టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య, పోలీస్ శాఖల్లో ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ అమలు, 6 డీఏల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు, ఈహెచ్‌ఎస్‌ అమలు, 17 శాతం హెచ్‌ఆర్‌ఏ, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విడుదల వంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో టీజీఈజేఏసీ జిల్లా నాయకులు వనజారెడ్డి, పొన్న మల్లయ్య, బొడ్డు శ్రావణ్‌కుమార్, నాగుల గోపాల్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...

సీపీఎస్‌ రద్దుకు సెప్టెంబర్‌ 1న నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న...

More like this