-నిరసన తెలిపిన నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్

మందమర్రి ప్రత్యక్షత: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచరులు జరిపిన దాడి ఘటనను ఖండిస్తూ జాతీయ అధ్యక్షులు జాజూల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ లు పిలుపు మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.నీలకంటేశ్వర్ రావు, జిల్లా అధ్యక్షులు డా.ఉదారి చంద్రమోహన్ గౌడ్ ల నాయకత్వంలో మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు.అనంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ లు మాట్లాడుతూ..అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల కోసం ఆలోచించని వాళ్ళు నేడు బీసీల పట్ల కపట ప్రేమను చూపిస్తూ, మా బీసీ బిడ్డ మీద చేసిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం అని తెలిపారు.తెలంగాణ యాస, భాషల పట్ల అవగాహన లేని వాళ్ళు నేడు బీసీ బిడ్డ చట్ట సభలో వారితో పాటు కూర్చుంటే ఓర్వలేక అనగదొక్కే కుట్రలను తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని, ఇకనైన వారి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాడ క్రాంతి కుమార్, పారుపెల్లి శివరామకృష్ణ, చెప్పాల రమేష్, రెడ్డి అయిలయ్య, మొగిలిచెర్ల రాజేష్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి