-నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి శ్రీనివాస్

ప్రత్యక్షత:- మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఆదివారం జనసంఘ్‌ వ్యవస్థాపకులు డా.శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం బిజెపి మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ..సమైఖ్య భారత వని కోసం గాను ప్రాణాలర్పించిన త్యాగధనుడు డా.శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అని కొనియాడారు. పార్టీ శ్రేణులందరూ డా.శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఆశయ సాధన కోసం గాను అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్, కార్యదర్శి తాటి సమ్మయ్య గౌడ్, శక్తి కేంద్రం ఇంచార్జీ కొమ్ము కుమార్ యాదవ్, ఓబీసీ నాయకులు ఆవిడపు సురేష్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి