హోమ్ టాప్ న్యూస్ భగత్ సింగ్ రెవల్యూషన్ సంఘం అధ్వర్యంలో వీరులకు ఘన నివాళులు

భగత్ సింగ్ రెవల్యూషన్ సంఘం అధ్వర్యంలో వీరులకు ఘన నివాళులు

0

-ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ మునీర్ చిత్రపటానికి నివాళు

మందమర్రి ప్రత్యక్షత:-భగత్ సింగ్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంఘం ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌ దేవ్‌ ల 95వ వర్ధంతి పురస్కరించుకొని వీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెవల్యూషన్ సంఘం అధ్యక్షుడు ఎండి అక్బర్ ఖాన్, వ్యవస్థాపకులు అనిల్ భగత్, పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గండ్ల సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కడారీ శ్రీధర్ లు కలిసి త్యాగ ధనులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ అజాద్, ఠాకూర్ రోషన్ సింగ్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌ దేవ్‌, సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ ల చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గండ్ల సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కడారీ శ్రీధర్ లు మాట్లాడుతూ మందమర్రి పట్టణానికి చెందిన భగత్ సింగ్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంఘం దశాబ్దనర కాలంగా అన్నదానం, మెగా రక్తదాన శిబిరాలు, అత్యవసర సమయంలో రక్తదానం, వైద్య శిబిరాలు, అనాధ మృతదేహాలకు అంతక్రియలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 50 వేలు పైగా నోట్ పుస్తకాలు, పదోవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, మండుటెండలు బాటసారిల కోసం చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ, విదేశీ ప్రతినిధులతో ఇంజినీరింగ్ విద్యార్థులకు అవగాహన సదస్సులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర, ఓటు హక్కు పై 5లక్షల కరపత్రాల పంపిణీ, సామాజిక స్పృహతో సామాజిక సమస్యల పై స్పందిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నారని అన్నారు. అక్బర్ అనిల్ కలిసి భగత్ సింగ్ రెవల్యూషన్ సంఘం ఏర్పాటు చేసి నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్లు, మంత్రులు, ఎస్పీ ల చేతుల మీదుగా ఉత్తమ స్వచ్చంద సంస్థగా, ఉత్తమ స్వచ్చంద సేవకులుగా 25కు పైగా ఈ ప్రాంతానికి అవార్డులు రావడం జరిగింది అంటే ఎంతో గొప్ప విషయం అన్నారు. అనంతరం అనిల్ భగత్, అక్బర్ ఖాన్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌ దేవ్‌ లు అంటే పోరాట స్ఫూర్తి అని అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వీరుల త్యాగం మరువలేనిది అని అన్నారు. భారత్ ప్రజానికానికి త్యాగమూర్తులు ఇచ్చిన సందేశం విప్లవం అంటే బాంబులు తుపాకులు మాత్రమే కాదని విప్లవం అంటే మార్పు అని, విప్లవం అంటే అణచివేతులు, అక్రమాలను ప్రశ్నించడం అని అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌ దేవ్‌, రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్‌, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ అజాద్, ఠాకూర్ రోషన్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వీరులు మరణించి వందేళ్లు కావస్తున్నా దేశ యువతలో నేటికి సజీవంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజు, శ్రీనివాస్, జీడి సారంగం, ఎండి జుబేర్, జిలకర సంపత్, మండల రాజు, గడ్డం కృష్ణకాంత్, డి.జీ చొప్పదండి స్వామి, దూడపాక శ్రీనాథ్, మర్రి మహేష్, బాబా, వెంకటేష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version