-10వ జాతీయ బీసీ మహా సభలు ప్రారంభం
-బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్

మంచిర్యాల ప్రత్యక్షత:- ఆగస్టు 7న గోవా రాష్ట్రంలో జరిగే జాతీయ ఓబీసీ 10వ మహా సభలను విజయవంతం చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ల పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ఉదారి చంద్రమోహన్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. నీలకంఠేశ్వర్ రావుల ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో వాల్ పోస్టర్లను విడుదల చేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు.అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్, పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్ లు మాట్లాడుతూ..మేమెంతో. మాకంత నినాదంతో ఒకవైపు మన హక్కుల కోసం పోరాడి విజయాలు సాధించుకుంటూనే, మరోవైపు “పాలితులుగా ఉన్నవాళ్ళం నేడు పాలకులం కావాలి” అనే ఎజెండాతో అంతిమంగా రాజకీయ అధికారాన్ని సాధించి బీసీల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ నాయకులు తడిగొప్పుల రవిరాజా, జాడ క్రాంతి కుమార్, చెప్పాల రమేష్, కలీం, యోగానంద రావు, సంపత్, కలీల్, ఎర్రన్న, యాదగిరి, రమేష్, యూత్ నాయకులు గరిగె సుమన్, ముష్కే అఖిల్, శ్రావణ్, అర్కటి రవీందర్, అనిల్, ఒమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.