హోమ్ టాప్ న్యూస్ బద్రి వెంకటయ్య జ్ఞాపకార్థం పాఠశాలలో పరీక్ష సామాగ్రి పంపిణీ

బద్రి వెంకటయ్య జ్ఞాపకార్థం పాఠశాలలో పరీక్ష సామాగ్రి పంపిణీ

0

ప్రత్యక్షత: రామకృష్ణాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో క్యాతనపల్లి పంచాయతీ మొట్టమొదటి ఏకగ్రీవ సర్పంచ్ బద్రి వెంకటయ్య పటేల్ 38వ వర్ధంతిని పురస్కరించుకొని వారి మనవడు బద్రి సంతోష్ కుమార్ ఆద్వర్యంలో పట్టణ ఎస్.ఐ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు చేతుల మీదుగా విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..క్యాతనపల్లి గ్రామపంచాయితీ గా ఉన్నప్పుడు మొట్టమొదటి ఏక గ్రీవ గ్రామ సర్పంచ్ బద్రి వెంకటయ్య పటేల్ 1958 నుండి 1971 వరకు 13 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించారని వారి జ్ఞాపకార్థం పదవ తరగతి విద్యార్దినుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేయడం చాలా సంతోషకరమని విద్యార్థినులు చదువుపై దృష్టి సారించి మంచి ఉత్తీర్ణత కనపరచి ఇంకా మరెన్నో విజయాలు సాధించి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని చదువుతున్న పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ యెుక్క కార్యక్రమంలో అమరవాది గ్రామస్తులు, పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version