-జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి చీపెల్లి బాపు

ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయున్నీ కేటాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చీపెల్లి బాపు అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని కాచిగూడ ఎస్టీయు భవన్లో శుక్రవారం నిర్వహించిన పాఠశాల విద్యలో నాణ్యత మన బాధ్యత అనే అంశంపై నిర్వహించిన విద్యా సదస్సుకు హాజరై ఆయన మాట్లాడారు..ప్రాథమిక స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో ఉపాధ్యాయుడు బోధించడం వల్ల ఆకర్షణీయమైన బోధన పిల్లలకు అందుకుందని ఆయన పేర్కొన్నారు. నూతన సబ్జెక్టును వేరువేరు ఉపాధ్యాయులు బోధించడం వల్ల పిల్లలకు మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. వాస్తవ స్థితికి దగ్గర లేని సీసీఈ విధానాన్ని తొలగించాలని ఇప్పటికే దీనిపై 18 రాష్ట్రాల్లో రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రాథమిక స్థాయి ప్రస్తుత సిలబస్ సంక్లిష్ట తను తొలగించి పుస్తకభారాన్ని తగ్గించాలన్నారు. నిత్యజీవితంలో వినియోగంలో ఉండే అధ్యాయాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పార్వతి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజేంద్ర, రాష్ట్ర కోశాధికారి సదయ్య వివిధ సబ్జెక్టుల విషయ నిపుణులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి