-జిల్లా టిఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యేక్షత:-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ టీజీఈజేఏసీ, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సంద అశోక్ పదవి విరమణ సన్మాన సభకు హాజరైన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ లు హాజరయ్యారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సంద అశోక్ పదవి విరమణ సభలో ఆయన చేసిన సేవలు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడారు.అనంతరం సంద అశోక్ దంపతులకు పూలమాలలు వేసి, చిత్రపటాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర సంఘం కు సంద అశోక్ చేసిన సేవలను మరువబోమని యూనియన్ అభివృద్ధికి తన వంతు సాయం కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి పదవి విరమణ అనివార్యమని వారి బావిజీవితం సుఖశాంతులతో,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.మంచిర్యాల జిల్లాకు తన సహాయక సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరు సురేష్ బాబు,యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, జిల్లా కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీధర్ రాజు, నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్,బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ లు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి