
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్సై జె. శ్రీధర్ తన సిబ్బందితో కలిసి దాడి చేపట్టగా, అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు చేసిన వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్, మూడు మొబైల్ ఫోన్లు, రూ.8,640 నగదు, పేకాట పత్తాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై జె. శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పేకాట వంటి అక్రమ వ్యవహారాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


