-జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)పి చంద్రయ్య
-టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రానున్న పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య, టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, అవగాహన తరగతులు నిర్వహించగా, ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు మంచిగా చదువుకొని, ప్రతి ఒక్కరు పదికి పది జిపిఏ సాధించాలన్నారు. కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత విద్యావంతులై, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులై, జిల్లాకు వన్నె తేవాలని కోరారు. అనంతరం జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని భాగ్యవతి, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ డిడి దుర్గాప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి, ఏటీడిఓ సురేష్, సైకాలజిస్ట్ వైద్యుడు డాక్టర్ సురేష్, సమీకృత బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి ధర్మానంద్ గౌడ్, పలువురు అధ్యాపకులు, వసతి గృహం సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
