హోమ్ టాప్ న్యూస్ పదోన్నతి పొందిన ఉద్యోగికి టీఎన్జీవో సన్మానం

పదోన్నతి పొందిన ఉద్యోగికి టీఎన్జీవో సన్మానం

0

-ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో పోరాడుతుంది: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:- అటవీశాఖ జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పదోన్నతి పొందిన సందర్భంగా మంచిర్యాల టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఆయనకు పూల మొక్కను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..అటవీ శాఖలోని ఉద్యోగులకు పదోన్నతుల గురించి సహకరించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ అలాగే టీఎన్జీవో ఫారెస్ట్ ఫోరం కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో అటవీ శాఖ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చిన జిల్లా టీఎన్జీవో పక్షాన సమస్యలపై పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,జిల్లా యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్,ప్రశాంత్ పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version