ప్రత్యక్షత: మంచిర్యాల జిల్లా పశువర్ధక శాఖలో నాలుగు దశాబ్దాలు గా వివిధ హోదాలలో విధులు నిర్వర్తించిన సుధారాణి ఏవో పదవి విరమణ సందర్భంగా జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన సుధారాణి ని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతిఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి భావిజీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, తదితర టీఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి