రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- పట్టణ నూతన ఎస్సైగా మంగళవారం ఎల్.భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతకుముందు గోదావరిఖని వన్ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహించారు. రామకృష్ణాపూర్ ఎస్సైగా ఉన్న జి రాజశేఖర్ సిసిఆర్బి రామగుండం కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై ఎల్.భూమేష్ మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి