-జిల్లా టిఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో

మంచిర్యాల ప్రత్యక్షత :- జిల్లాలో నూతన బాధ్యతలు చేపట్టిన అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ పి చంద్రయ్య వికారాబాద్ జిల్లా నుండి బదిలీపై జిల్లాకు విచ్చేసిన ఆ అధికారికి ఘన స్వాగతం పలికారు. అలాగే జిల్లా వ్యవసాయ అధికారిగా నూతన బాధ్యతలు చేపట్టిన భూక్యా ఛత్రు నాయక్ కరీంనగర్ జిల్లా నుండి బదిలీపై జిల్లాకు విచ్చేసిన అధికారులను జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు ఘనంగా సన్మానించి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని ప్రజలకు శాఖపరమైన సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, అజయ్ సూపరింటెండెంట్ వసంత కుమార్, గంగారం సభ్యులు కార్తీక్, అజయ్, వెంకటస్వామి పాల్గొన్నారు.