రామకృష్ణాపూర్ (ప్రత్యక్షత): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో పలు రంగాలలో సేవలు అందించిన 100 మంది మహిళలకు నారీ రత్న ఉమెన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు 2025 పురస్కార్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది.ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణనికి చెందిన సమీక్ష ఆర్ట్స్ అకాడమీ చైర్పర్సన్ ఎర్రవెల్లి మెర్సీ రాణి క్లాసికల్, ఫోక్ డాన్స్ యందు నారి రత్న అవార్డు ఆశీస్సు స్టూడియో విజయవాడ లో అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మెర్సీ రాణి మాట్లాడుతూ పిల్లలకు మెరుగైన సమాజ శ్రేయస్సు కోసం వారిలో ప్రేరణ కలిగించే విధంగా నిరంతరం పాటు పాడడం జరుగుతుందని తెలిపారు.సమీక్ష అర్ట్స్ అకాడమీ లో చదువుతోపాటు వివిధ రంగాల్లోకి ముందుకు తీసుకెళ్తూ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు పిల్లలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్ కుమార్ సి.ఇ.ఓ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్. కొల్లి రమావతి అంతర్జాతీయ సమన్వయ కర్త జాతీయ కన్వీనర్. కట్ల భాగ్యలక్ష్మి రాష్ట్ర మహిళ జిల్లా అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి