
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర గణనీయమైనదని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ జె. శ్రీధర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో న్యూస్ లైన్ తెలంగాణం దినపత్రిక నూతన సంవత్సర 2026 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ జె. శ్రీధర్ మాట్లాడుతూ, సమ సమాజ నిర్మాణంలో, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో పత్రికల పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. ప్రజలకు నిష్పక్షపాతమైన, సత్యనిష్ఠ వార్తలను అందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ఇతర సంస్థలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా మీడియా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ జె. శ్రీధర్ రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు మిట్టపల్లి సంతోష్, ఎరుకల బుచ్చిబాబు, వేల్పుల కిరణ్, ఎర్రవల్లి శ్రీనివాస్, పిల్లి రవి కిరణ్, బద్రి సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.