హోమ్ టాప్ న్యూస్ టీజీఈజేఏసీ రాష్ట్రస్థాయి సదస్సు

టీజీఈజేఏసీ రాష్ట్రస్థాయి సదస్సు

0

-మంచిర్యాల జిల్లా జేఏసీ నాయకులు గడియారం శ్రీహరి

రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.ఈ సదస్సు కార్యక్రమానికి టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి, కో- చైర్మన్ పొన్న మల్లయ్య,డిప్యూటీ చైర్మన్ భూముల రామ్మోహన్, కొట్టే శంకరయ్య నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సుమిత్ లు సదస్సులో పాల్గొన్నారు.

ఈ సదస్సులో మంచిర్యాల జిల్లా జేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున రాష్ట్ర జేఏసీ కు ఈ క్రింది ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉన్న 5 డిఎ లను పెండింగ్ బకాయి బిల్లులను పిఆర్సి కమిటీ నివేదిక తప్పించుకొని 51% విటమిన్ తో వేతన సవరణ చేయాలని.ఈహెచ్ఎస్ ఈ హెచ్ ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిపిఎస్ తొలగించి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు.317 జీవో ను సమీక్షించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని. సిపిఎస్, యుపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలని అన్నారు.చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఇతర 57 డిమాండ్లను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా జేఏసీ పక్షాన కోరారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో జేఏసీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా తరపున సిద్ధమవుతామని తెలిపారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version