-మరణించిన వారికి నివాళులు అర్పించిన: టీజీఈజేఎసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి

జమ్మూ కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని టిఎన్జీవో భవనం నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అనంతరం దాడిలో మరణించిన మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిజిఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం అత్యంత బాధాకరమని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ,వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు.

ప్రభుత్వం నుంచి వారికి అన్ని రకాల సహాయక సహకారం అందించాలని కోరారు. అదేవిధంగా ఉగ్రవాదులు అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీజీఈజెఎసి జిల్లా ప్రధాన కార్యదర్శి కే వనజా రెడ్డి మాట్లాడుతూ, తీవ్రవాదులను అత్యంత కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు పార్వతి సత్యనారాయణ, జిల్లా అడిషనల్ ప్రధాన కార్యదర్శి కే శంకర్, నాయకులు జి చక్రపాణి, ఎల్ కృష్ణ, ఎస్ వెంకటేశ్వర్లు, ఏ సుభాష్, జి సుమీత్, పి సంజీవ్, ఏ రమేష్, డి వేణుగోపాల్, పి సత్తయ్య బి ప్రభాకర్, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గాప్రసాద్, కెవిఎల్ఎన్ మూర్తి, రాజేశ్వర్, భూముల రామ్మోహన్, ఏ సుధాకర్, బి మోహన్, జి రాజా వేణు, సిహెచ్ బాపూ, బి మనోజ్, ఎం జయకృష్ణ, ఎస్ గంగాధర్, బి రవీందర్, ఎస్ కిషన్, బాలకృష్ణ, ఆర్ రవికిరణ్, బి శ్రావణ్ కుమార్, ఏ సునీత, ఎన్ గోపాల్, మోసిన్ అహ్మద్, బి వెంకటరమణ, ఏ సతీష్ కుమార్, జే రామ్ కుమార్, ఎండి అజార్, తిరుపతి, వెంకటేశం లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి