హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం

0

-ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-తెలంగాణ వెల్ఫేర్ అధికారులు జిల్లా టీఎన్జీవో భవనంలో బుధవారం జిల్లా అధ్యక్షులు మోసిన్ అహ్మద్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి పాల్గొన్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, విశిష్ట అతిథులుగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 20 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వ నమోదు చేసుకొని జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి చేతుల మీదుగా నాన్ గెజిటెడ్ ఉద్యోగులు నమోదు పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని శాఖల నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ రెండు రోజులలో సభ్యత్వ నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, యూనియన్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version