హోమ్ టాప్ న్యూస్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

0

-కలెక్టర్,ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో జిల్లా నాయకులు

మంచిర్యాల ప్రత్యక్షత:- టిఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 2026 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండడానికి జిల్లాలోని ఉద్యోగులందరూ కృషి చేయాలని తెలిపారు.మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ..మంచిర్యాల నియోజకవర్గం ను అభివృద్ధి పథంలో నడపడానికి ఉద్యోగులు నిరంతరం కృషి చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం ను అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం లోనే మొదటి స్థానంలో ఉండడానికి ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి జిల్లా టిఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version