మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీఎన్జీవో మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు లు విచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్, కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 97 మంది టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్షలు, కార్యదర్శులు నిరంతరాయంగా కష్టపడి అన్ని శాఖల ఉద్యోగులు డిసెంబర్ 10 లోపు సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ అనురాగ్,వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ శాఖ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి