-స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి: జాయింట్ కలెక్టర్ శ్యామల దేవి
-స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించాలని: గడియారం శ్రీహరి

అంతర్జాతీయ మహిళా దినోత్సవము పురస్కరించుకుని టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆద్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ శ్యామల దేవి టీఎన్జీవో భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో మహిళా జిల్లా నాయకులు కేజియారాణి , సునీత,పద్మలత ఆధ్వర్యంలో జిల్లా లోని మహిళ ఉద్యోగులు ఘనంగా ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు చేసుకోనైనది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథి శ్యామలాదేవి జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలని పురుషులతో సమానంగా అవకాశాలు పొందాలని అన్ని రంగాలలో స్త్రీలు ముందుండాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. స్త్రీ లేనిదే జననం లేదని గమనం లేదని ఈ సృష్టిలో అన్నిటికీ మూలమైనది స్త్రీ అని కావున సమాజంలో స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన తెలిపారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అద్యక్షులు శ్రీపతి బాపు రావు,కోశాధికారి ఏ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్,రామ్ కుమార్ , తిరుపతి,అంజయ్య, నరేందర్ సంయుక్త కార్యదర్శిలు సునీత,పద్మలత, ప్రభు, రవికిరణ్ ,పబ్లిసిటీ సెక్రటరీ యూసఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ మందమర్రి యూనిట్ అద్యక్షులు సుమన్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, విజయ మోసిన్,కుమార్,సంజీవ్, ప్రణవానంద్,తదితరులు పాల్గొన్నారు.

