-గడియారం శ్రీహరి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

మంచిర్యాల ప్రత్యక్షత :-తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ను పునస్కరించుకొని సోమవారం మంచిర్యాల జిల్లా టీఎన్జీవో భవనంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి చేతుల మీదుగా జాతీయ జెండా ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అవతరణలో తొలి మలిదశ ఉద్యమంలో అమరులైన అనేకమంది విద్యార్థులు, ఉద్యమకారుల ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి త్యాగాల పైన వచ్చిన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్క ఉద్యోగులు పాలుపంచుకోవాలని అన్నారు. ఈ వేడుకలలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియారాణి, రామ్ కుమార్, తిరుపతి సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు, రవికిరణ్, వెంకటకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి