హోమ్ టాప్ న్యూస్ టీఎన్జీవో భవనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

టీఎన్జీవో భవనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

0

-చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన: గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల టిఎన్జీవో భువన కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..భారత రాజ్యాంగం నిర్మాణ విధానంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ సేవలను గుర్తు చేశారు.సమాజంలోని అంటరానితన్నాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్‌ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత ప్రభు ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్ స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్,మంచిర్యాల్ యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ప్రశాంత్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version