
మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుమార్ దీపక్ చేతుల మీదుగా సోమవారం జిల్లా టీఎన్జీవో క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న టీఎన్జీవో ఉద్యోగులందరినీ అభినందించారు.గడియారం శ్రీహరి మాట్లాడుతూ..విధినిర్వహణలో ప్రజలకు అందవలసిన ప్రభుత్వ పథకాలను సక్రమంగా నిర్వహించడం టీఎన్జీవో ఉద్యోగుల ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాలెండర్,డైరీ లను ఆవిష్కరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆయనకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, కేజియా రాణి, పద్మ లత, నరేందర్, శ్రీధర్, రాజు సంయుక్త కార్యదర్శిలు సునీత, ప్రభు, సురేందర్, రోశయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్, పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ప్రశాంత్, లక్షెట్టిపేట్ యూనిట్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్,బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్,మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్,చెన్నూరు యూనిట్ అధ్యక్షులు అభిషేక్,కన్నెపల్లి యూనిట్ అధ్యక్షులు పద్మనాభం, జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మజ, రాజేందర్, కుమార్, మోసిన్, ప్రణవా నందు, సరిత తదితరులు పాల్గొన్నారు.