మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్ రోడ్ లోగల టిఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీ కాలనీలో గురువారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్య నిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, నాయకులు కస్తూరి నాగేశ్వర్, నాగుల గోపాల్, శ్రావణి, సునీల్ దంపతులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పరస్పరం జమ్మి ఆకును పంచుకుంటూ, ఆనందోత్సాహాల నడుమ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాయి బలాయి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇటీవల ఎంబిబిఎస్ లో బంగారు పతకాలు సాధించిన గడియారం శ్రీహరి కుమార్తె గడియారం అక్షయ ను కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు తిరుపతి రెడ్డి, రాజమౌళి, ఊషన్న, కృష్ణ గోపాల్, సునీత, అరుణ, స్వప్న, ఆండాలమ్మ, పుష్ప, పూజారి సాయి మృదుల్, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి