మంచిర్యాల ప్రత్యక్షత:- తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం (టిఏఈఓ ఎస్)జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన సమావేశానికి టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించగా, సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. టిఏఈఓ ఎస్ జిల్లా నూతన అధ్యక్షునిగా ఉప్పులేటి శంకర్ (తాండూరు), ప్రధాన కార్యదర్శిగా ఆగిడి రామచందర్ (నెన్నెల), కోశాధికారిగా రాజశేఖర్ (చెన్నూరు) లు నియమితులయ్యారు. అదేవిధంగా సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఎస్ కనకరాజు, కొమరయ్య, ఉపాధ్యక్షులుగా సాయిని శ్రీనివాస్ (లక్షేట్టిపేట్), వినోద్ కుమార్ (భీమిని), త్రిసంధ్య (జన్నారం), ప్రధాన కార్యదర్శులుగా వసుధ (తాండూరు), ఆఫ్రోజ్ (భీమిని), ఈసీ సభ్యులను సైతం నియమించి, నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, డివిజన్ వ్యవసాయ సహాయ సంచాకులు బానోతు ప్రసాద్ (చెన్నూరు), రాజా నరేందర్ (బెల్లంపల్లి), కృష్ణ (మంచిర్యాల) ముఖ్యఅతిథులుగా హాజరై, నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ముత్యం తిరుపతి, మాజీ ప్రధాన కార్యదర్శి చొప్పదండి తిరుపతి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి