
మంచిర్యాల ప్రత్యక్షత:-టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికై మొదటిసారి పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన మారం జగదీశ్వర్ ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ కు ఘన స్వాగతం పలుకుతూ, శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ హుస్సేనీ ముజీబ్ లు ఎన్నిక కావడం సంతోషకరమని తెలిపారు. స్పందించిన జగదీశ్వర్ తొందరలోనే ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేసి, ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారన్నారు. ఈకార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మాజీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్, రెవెన్యూ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, సభ్యులు మల్లేష్ లు పాల్గొన్నారు.