-ఏరియా ఆసుపత్రి సిబ్బందికి ఎస్సై శ్రీధర్ దిశానిర్దేశం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించిన పట్టణ ఎస్సై శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..మోటార్ సైకిల్ పై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ దారులు సీటు బెల్టు పెట్టుకోవాలని వాహనం సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు, క్షేత్రస్థాయిలో వారు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.చిన్నపిల్లలకు టూవీలర్ మరియు ఫోర్ వీలర్ ఇవ్వకూడదని, అతివేగంగా ఆజాగ్రత్తగా ఇవ్వకూడదని, సూచించారు.ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎస్సై ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ ఇన్చార్జ్ మధు కుమార్,హెడ్ కానిస్టేబుల్ సంఘ సత్తయ్య,కానిస్టేబుల్ సతీష్ ,హోమ్ గార్డ్ సమ్మయ్య ఏరియా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.