-వేడుకల్లో పాల్గొన్న రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్యామలా దేవి

మంచిర్యాల ప్రత్యక్షత:-పురుషులతో సమానంగా అవకాశాలు పొందుతూ, అన్ని రంగాల్లో స్త్రీలు ముందుండాలని రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)శ్యామలాదేవి తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టిఎన్జీవో భవనంలో ఆదివారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె జిల్లా బీసీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు సంఘం మహిళా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి, ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈమహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా టీఎన్జీవో మహిళా జిల్లా నాయకురాలు కేజియా రాణి, సునీత, పద్మలత, పద్మజ, సాహితీ పద్మ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా, జిల్లాలోని మహిళా ఉద్యోగులు ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాలుపంచుకున్నారు. సందర్భంగా ముఖ్య అతిథులు శ్యామలాదేవి, భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ, టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. మహిళలు విద్యా, వైద్య, ఉద్యోగ, రాజకీయ, ఇతర అన్ని రంగాల్లో రాణించినప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఘనంగా ఈ వేడుకలు నిర్వహించిన టిఎన్జీవో జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో టిఎన్జివో చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామన్నారు. అనంతరం టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, స్త్రీ లేనిదే జననం లేదని, గమనం లేదని, ఈ సృష్టిలో అన్నిటికీ మూలం స్త్రీ నే అని, సమాజంలో స్త్రీలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. మహిళలందరూ ఉన్నతమైన స్థానానికై కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్ఉ పాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, అంజయ్య, నరేందర్, శ్రీధర్ రాజు, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, పద్మజ, సురేందర్, రోశయ్య జ్యోతి, పబ్లిసిటీ కార్యదర్శి యూసుఫ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ కుమార్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, లక్షేట్టిపేట్ యూనిట్ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, చెన్నూరు యూనిట్ అధ్యక్షుడు అభిషేక్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, సాహితీ, రాజేందర్, సరిత, ప్రణవానంద్, వెంకటస్వామి, అశోక్ లు పాల్గొన్నారు.
