-జాతీయస్థాయిలో జిల్లాకు అవార్డు రావడం అభినందనీయం: టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత :-కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి జల్ సంచయ్ జన్ భగీదారి 6వ జల పురస్కారాలలో భాగంగా మంచిర్యాల జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జిల్లా కు ఈ అవార్డు రావడానికి కృషిచేసిన జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ ను వారి కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు అవార్డు రావడానికి అధికారుల,ఉద్యోగుల సహకారంతో ఈ అవార్డు లభించిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అవార్డులు అందుకోవాలంటే ఉద్యోగుల సహాయ సహకారాలు ఉండాలని అన్నారు.

టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాకు జాతీయస్థాయిలో ఈ అవార్డు రావడం అభినందనీయం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రావడానికి టీఎన్జీవో ఉద్యోగుల సహాయ సహకారాలు ఎల్లవేళలా సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్,ఉపాధ్యక్షులు కేజియా రాణి,శ్రీనివాస్, తిరుపతి,రామ్ కుమార్,సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ ప్రశాంత్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, సభ్యులు గంగారం, ప్రశాంత్, విజయ, యూసుఫ్, కరుణాకర్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
