-నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణకు సహకరించండి
-టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లాలోని టిఎన్జివో ఆరు యూనిట్లు డిసెంబర్ మాసంలో వంద శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, వంద శాతం సంఘం సభ్యత్వ నమోదు పూర్తి చేసి, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సంఘం నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణకు ప్రతి యూనిట్ నుంచి సహాయ సహకారాలు అందించి, నూతన సంవత్సరంలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.
ఈసందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఐదు డిఏ లు వెంటనే ఇవ్వాలని, నూతన పెన్షన్ విధానం (సిపిఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) ను పునరుద్ధరించాలని ఈసమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి, రాష్ట్ర కార్యవర్గానికి పంపించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, రామ్ కుమార్, తిరుపతి, అంజయ్య, శ్రీధరాజు, శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ప్రశాంత్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, ప్రచార కార్యదరి యూసఫ్ లు పాల్గొన్నారు.