
బెల్లంపల్లి ఏరియాలో గోలేటి ఓపెన్ క్యాస్ట్ ను వెంటనే ప్రారంభించాలని ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవలక్ష్మి సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.శనివారం ఆమె గోలేటి లోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జీఎం ఎం శ్రీనివాస్ ని కలిసి ఓపెన్ కాస్టు పరిస్థితులపై చర్చించారు .ఫారెస్ట్ భూమి క్లియరెన్స్ కాక ఓపెన్ కాస్ట్ ఆలస్యం అవుతుందని జీఎం తెలియజేశారు.ఈ
సందర్భంగా కోవాలక్ష్మి మాట్లాడుతూ..ఫారెస్ట్ అధికారుల తో చర్చిస్తానని వీలైనంత తొందరగా పర్మిషన్లు రావడానికి కోసం అవసరమైతే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు .బెల్లంపల్లి ప్రాంతంలో గోలేటి ఓపెన్ కాస్ట్ ఏంవికే 3 ఓపెన్ కాస్ట్ ప్రారంభమైతే ఈ ప్రాంతంలో పర్మనెంట్ కార్మికులకు ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయని అందుకే తొందరగా ఓపెన్ కాస్ట్ ను ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
