-ప్రచారంలో ప్రజల నుండి అపూర్వ స్పందన

క్యాతనపల్లి ప్రత్యక్షత:-రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా క్యాతనపల్లి 01వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ముద్దసాని తిరుపతి తన ప్రచార పర్వంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో వార్డులోని పలు కాలనీలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ముద్దసాని తిరుపతి ఇంటింటి ప్రచారంలో పార్టీ కాదు..ప్రజలే నా బలం..మీ గొంతుకగా..మీ మధ్య నుంచే అనే నినాదం తో పేద ప్రజల అభివృద్ధి కొరకే స్వతంత్ర అభ్యర్థిగా 01వ వార్డు ని తీర్చిదిద్దుతానని నమ్మకంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నానని అన్నారు.ఈ నెల 11న ఎన్నికల్లో వార్డు ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. వార్డు అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రజలు నిన్నే గెలిపిస్తా మంటూ ధీమా వ్యక్తం చేయడంతో వాతావరణం ఉత్సాహంగా మారింది. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రచార సరళిని గమనిస్తున్న విశ్లేషకులు స్వతంత్ర అభ్యర్థి ముద్దసాని తిరుపతి ఘన విజయం ఖాయమంటున్నారు.