
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- పట్టణంలోని అబ్రహం నగర్ లో ఓ వ్యక్తి గుడుంబా తరలిస్తుండగా పట్టణ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వాహన తనిఖీలో భాగంగా 08 లీటర్ల గుడుంబా 150 ప్యాకెట్లతో ద్విచక్ర వాహనపై వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్ కథనం ప్రకారం.. పట్టణంలోని ‘బి’ జోన్ సెంటర్ అబ్రహం నగర్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పులిమడుగు గ్రామానికి చెందిన భూక్య రవి (45) అనే వ్యక్తి గుడుంబా తయారు చేసి సరఫరా చేస్తున్న 08 లీటర్ల గుడుంబాను 150 ప్యాకెట్లలో నింపి ఓ సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో అనుమానంతో సంచిని పరిశీలించగా గుడుంబా ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకొని గుడుంబా సరఫరా చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా వ్యక్తులు గుడుంబా తయారు చేసిన అమ్మిన చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్ళు జంగు, శ్రీనివాస్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉన్నారు.