తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ భవన్ నుండి గన్ పార్క్ వరకు సంవిదాన్ బచావో ర్యాలీని గణతంత్ర దినోత్సవం వేడుకల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఐకమత్యంతో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారని అన్నారు. బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వలననే మనమందరం సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమాల్లో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి స్వర్ణ గౌడ్, శకుంతల, సంగీత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి