
రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- పట్టణ పరిధిలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం ఆధారంగా అనుమానితుల ఇళ్లలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. గంజాయి సేవించడం, విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీధర్ హెచ్చరించారు. గంజాయి రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం నిరంతరం నిఘా ఉంచుతోందని తెలిపారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.



