-టీఎన్జీవో- హౌసింగ్ సొసైటీ నాయకులు మొక్కులు చెల్లింపు

ప్రత్యక్షత :-మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ మైసమ్మ కు టీఎన్జీవో, టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాలను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను మైసమ్మ తల్లికి ఊరింపుగా తీసుకోవచ్చి కల్లు సాక, నైవేద్యం పెట్టి మైసమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు మొండయ్య,టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు బాపన్న, హౌసింగ్ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు.