-గడియారం శ్రీహరి ని సన్మానించిన హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్

మంచిర్యాల ప్రత్యక్షత:-జిల్లా కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ కార్యాలయంలోని టీఎన్జీవో జిల్లా మాజీ సంయుక్త కార్యదర్శి హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి విచ్చేశారు. అలాగే టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు విచ్చేసి జిల్లా సహకార శాఖ కార్యాలయం లో 25 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకున్నారు. అనంతరం తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోసిన్ అహ్మద్ కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి కి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు కలిపి రెండు రోజుల లో మీ యూనిట్ లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులను కలుసుకొని సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని తెలిపారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.
