-నిర్లక్ష్యం వహిస్తే పోరాటాలకు సిద్ధం

-సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్

మందమర్రి ప్రత్యక్షత:-సింగరేణి కన్వేయన్స్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాలోని సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో గల ఎస్ఆర్పి ఓసిపి లో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశం శనివారం యూనియన్ ఓసిపి పిట్ కమిటీ అధ్యక్షుడు కాసీపేట రాజేశం అధ్యక్షత నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ,కన్వేయన్స్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓసిపిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కన్వేయన్స్ డ్రైవర్ల మౌలికమైన సమస్యలను సైతం అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు‌. టెండర్ ఆర్డర్లో ఉన్న ప్రకారంగా డ్రైవర్లకు రావాల్సినవి పూర్తిస్థాయిలో అమలు చేయడంలో లోపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రైవర్ల వేతనాల్లో విషయంలో సైతం జరిగే దోపిడి బహిరంగ రహస్యమని, పెరిగిన ధరలకు అనుగుణంగా రావలసిన వేతనాలనే డ్రైవర్లకు ఇవ్వకుండా యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.ఇంత జరుగుతున్న అధికారులు సైతం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్ల ప్రధాన డిమాండ్లైన వేతనాల పెంపు, పని భద్రత, రెస్ట్ షేడ్ ఏర్పాటు, ఇతర సమస్యలను అధికారులు, యజమానులు సానుకూలంగా స్పందించి, పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు, పోరాటాలకు సైతం సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పిట్ కమిటీ కార్యదర్శి సంపత్ రావు, నాయకులు సతీష్, రాజలింగు, రాఘవేంద్ర, సురేష్, రవి, నవీన్, నీరజ్, విద్యాసాగర్, శశిధర్, తోట శ్రీనివాస్, శ్రీధర్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి