-టీఎన్జీవో ఉద్యోగుల సమస్యలపై చర్చించిన: గడియారం శ్రీహరి

జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యల పైన చర్చించారు. ఎమ్మెల్సీ కోదండరాం సమస్యలపైన సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సాయం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,రామచందర్ రావు,పద్మశ్రీ, అరుణ, లక్ష్మి ,రవి కిషోర్, జనార్ధన్, సతీష్, మహేందర్,సదయ్య, స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.