-చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజ రెడ్డి

బెల్లంపల్లి శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి అందజేశారు.తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు,కార్మికులు పెన్సనర్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ని కలిసి టీజీఈజేఏసీ నాయకులు ఉద్యోగుల సమస్యలపై తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఉద్యోగ కుటుంబాల పై చేయూత అందించాలని ఉద్యోగుల 57 సమస్యలను కూడిన వినతి పత్రాన్ని అందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ..
టీజీఈజేఏసీ ఉద్యోగుల సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తమ వంతు సహాయ అందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజ రెడ్డి మాట్లాడుతూ..ఉద్యోగుల సమస్యలపై మే 15 లోపు స్పందించకపొతే నల్ల బ్యాడిలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జూన్ 9న హైదరాబాద్ లో జరిగే మహా సదస్సులో మంచిర్యాల జిల్లా తరుపున ప్రతి ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్క్ టూ రూల్-పెన్ డౌన్ సాముహిక సెలవులతో ప్రభుత్యం పై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ రాష్ట సెక్రెటరీ పొన్న మల్లయ్య, డిప్యూటి సెక్రెటరీ జనరల్ భూముల రామ్ మోహన్, కో-చైర్మన్ శ్రీపతి బాపూరావు, చక్రపాణి, రవి, చెన్నకేశవులు,సుధాకర్ గోపాల్, వెంకటేశం సంఘ సభ్యులు పాల్గొన్నారు.