హోమ్టాప్ న్యూస్ఉద్యోగుల సమస్యలపై టిఎన్జీవో నిరంతర కృషి

ఉద్యోగుల సమస్యలపై టిఎన్జీవో నిరంతర కృషి

Published on

spot_img

మంచిర్యాల ప్రత్యక్షత:-నస్పూర్‌లోని ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ నాన్‌ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) నూతన జెండా, కండువాలను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో నాయకులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం చాటారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ టీఎన్జీవోకు నూతన జెండా, కండువాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.ఉద్యోగుల సమస్యలపై కేంద్ర సంఘం ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవో ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.మంచిర్యాల జిల్లాలోని ప్రతి నాన్‌ గెజిటెడ్ ఉద్యోగి టీఎన్జీవోలో సభ్యత్వం తీసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని శ్రీహరి పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఐక్యతతోనే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోగలమని, సంఘం చేపట్టే కార్యక్రమాలకు ఉద్యోగులు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్‌కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, తిరుపతి, రామ్‌కుమార్, సత్యనారాయణ, నరేందర్, సంయుక్త కార్యదర్శులు సునీత, అంజయ్య, కార్తీక్, ప్రభు, పద్మలత, సురేందర్, రోశయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, పబ్లిసిటీ సెక్రటరీ యూసుఫ్, స్పోర్ట్స్ సెక్రటరీ కుమార్, కార్యవర్గ సభ్యులు రాజేందర్, జ్యోతి పాల్గొన్నారు.అలాగే మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, చెన్నూరు యూనిట్ అధ్యక్షుడు అభిషేక్, లక్షెట్టిపేట యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉద్యోగ సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

Latest articles

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...

సీపీఎస్‌ రద్దుకు సెప్టెంబర్‌ 1న నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సెప్టెంబర్‌ 1న...

More like this

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-మద్యపానానికి బానిసై, వివాహ సంబంధాలు విఫలమవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన...

ఏడో రోజూ నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,...

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ,...