హోమ్ టాప్ న్యూస్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకోవాలి

ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకోవాలి

0

మంచిర్యాల ప్రత్యక్షత:- జిల్లా టీఎన్జీవో బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు జి వెంకటేష్ ఆధ్వర్యంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సబ్ కలెక్టర్, రెవెన్యూ, ట్రేజరీ, వెల్ఫేర్ హాస్టల్, పంచాయతీ రాజ్, వెటర్నరీ, అగ్రికల్చర్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి,జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 50 మంది టీఎన్జీవో సభ్యత్వ నమోదు చేసుకున్నారు.

అనంతరం ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు నిరంతరాయంగా కష్టపడి అన్ని శాఖల ఉద్యోగులు డిసెంబర్ 10 లోపు సభ్యత్వం పూర్తిచేసి రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా ఆదర్శంగా ఉండాలని తెలిపారు.జిల్లాలోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న టీఎన్జీవో సమస్యల పరిష్కారంలో ముందు ఉంటదని అన్నారు.
అలాగే బెల్లంపల్లి టీఎన్జీవో యూనిట్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారి హనుమంతరావు కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్,తిరుపతి,ఉద్యోగులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Exit mobile version